twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను తేల్చుకోలేని పరిస్ధితి వచ్చినప్పుడే నాన్నగారి నిర్ణయం తీసుకుంటా

    By Nageswara Rao
    |

    సిద్దార్ద, శృతి హాసన్ కలసి జంటగా నటించిన చిత్రం అనగనగా ఓ ధీరుడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించారు శృతిహాసన్. ఈసందర్బంలో తన మనసులోని మాటలను కొన్నింటిని అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈసందర్బంగా శృతిహాసన్ మాట్లాడుతూ నా తప్పులు నేనే చేయాలి. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి' అంటున్నారు శృతి హాసన్.

    ప్రముఖ హీరో కమలహాసన్ కుమార్తెగా శృతి ఇప్పటికే బాగా పాపులర్ అయ్యారు. అయితే తండ్రి చాటు బిడ్డలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారామే. మీరు తీసుకునే నిర్ణయాలలో మీ పాత్ర ఎంత వరకు వుంటుంది? అని శృతిని అడిగినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు.

    మరింత వివరంగా చెబుతూ 'మనం చేసే తప్పులే మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఆ పాఠాలు భవిష్యత్ కు మంచి పునాది వేస్తాయి. అలా కాకుండా చీటికి మాటికి చిన్న పిల్లలా తండ్రివేలు పట్టుకుని నడిచి, అడుగడుగునా ఆయన సలహాలు తీసుకుంటే ఇక నా నడక నేనెప్పుడు నడవను? నా నిర్ణయాలు నేనెప్పుడు తీసుకొను? ఇంకోవిషయం ఏమిటంటే నాన్నగారి సలహా మేరకు ఏదైనా సినిమా ఒప్పుకుని, ఆ సినిమా మంచి ఫలితం ఇవ్వలేదనుకోండి... నాన్న నిర్ణయం తప్పు అనిపిస్తుంది.

    అప్పుడు ఆయన నిందకు గురికావాల్సి వస్తుంది. నా కారణంగా నాన్న మాట పడటం నాకిష్టం వుండదు. అందుకే నా నిర్ణయాలు నేనే తీసుకుంటా. నాకు అవసరమైనప్పుడు, ఎటూ తేల్చుకోలేనప్పుడు ఆయన్ను సలహా అడుగుతాను' అన్నారు శృతిహాసన్. సినిమా రంగం గురుంచి చెబుతూ 'అమ్మా నాన్న ఇద్దరు ఆర్టిస్ట్ లే కావడం వల్ల నేను చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణం లో పెరిగానని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X