twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలతో కెమిస్ట్రీ పండాలంటే అలా చెయ్యాల్సిందే...!

    By Sindhu
    |

    కథానాయిక అనుష్కకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే, ఓసారి సన్న పడాలి... మరోసారి కాస్త ఒళ్లు తెచ్చుకుని బొద్దుగా తయారవ్వాలి. ఎందుకంటారా... తానిప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నటిస్తోంది కదా... తమిళ ప్రేక్షకులేమో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటేనే ఇష్టపడతారు. సన్నగా నాజూగ్గా వుంటే వాళ్లకి నచ్చదు. మన తెలుగు వాళ్లకైతే, బొద్దుగా వుంటే నచ్చదు. మెరుపు తీగలా, సన్నజాజి తీగలా వుండాలి. ఇప్పుడీ ఇబ్బందిని అనుష్క ఎదుర్కుంటోంది.

    'కోలీవుడ్ కి, టాలీవుడ్ కీ ఒకేసారి డేట్లు ఇస్తే ఇక మా పని అయిపోయినట్టే. బాడీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని రెండు షూటింగులకీ కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. సినిమాలో హీరోలతో కెమిస్ట్రీ పండాలంటే శరీర సౌష్టవం కూడా ముఖ్యమే. తమిళ్ సినిమా షూటింగుకి రెడీ అయ్యే ముందు బాగా తిని ఒళ్లు పెంచాలి. మళ్లీ తెలుగు షూటింగుకి వచ్చే ముందు డైటింగులు, వర్కౌట్లు చేసి సన్నబడాలి. ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఇలా వుంటాయి మా బాధలు"అంటోంది. అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట ఈ యోగా టీచర్. ప్రస్తుతం అనుష్క, తమిళంలో విజయ్ తో నటించిన 'పులివేట"లో అనుష్క స్టిల్స్ హాట్ హాట్ గా మారాయి. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే రజనీకాంత్ నటిస్తున్న 'రాణా"చిత్రంలోనూ మంగళూరు భామ ఛాన్స్ లు మీద ఛాన్సులు కొట్టేసినట్టు కోలీవుడ్ సమాచారం.

    English summary
    Anushka Shetty and Vijay starrer Tamil blockbuster 'Vettaikaran' is releasing in Telugu as 'Puli Veta'. This film will hit the screens in first week of March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X