'గురి' టైటిల్ తో పవన్ కళ్యాణ్

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 15:53 [IST]
పవన్ కళ్యాణ్, విష్ణువర్ధన్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పంజా. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యిన ఈ చిత్రం తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. కురి పేరుతో డబ్బింగ్ అయ్యే ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. కురి అంటే గురి అని అర్దం. పంజాని డైరక్ట్ చేసింది తమిళ డైరక్టర్ కావటంతో ఈ చిత్రానికి అక్కడ మంచి మార్కెట్ ఉండే అవకాసం ఉంది. అక్కడ విష్ణు వర్ధన్ గతంలో అజిత్ తో భిళ్లా వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నారు. ఇక పవన్ చిత్రాలు పెద్దాగ అక్కడ విడుదల చేయరు.

అడపాదడపా చేసినా కేవలం శాటిలైట్ కోసమే చేసినట్లు డబ్ చేస్తారు. అయ్యితే ఈ చిత్రాన్ని స్ట్రైయిట్ పిక్చర్ స్దాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే చిత్రానికి సంగీతం అందించిన యవన్ శంకర్ రాజాకు కూడా తమిళంలో మంచి మార్కెట్ ఉండటంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్లాప్ సినిమాతో అక్కడ లాంచ్ అవటం ఎందుకని పవన్ అభిమానులు భావిస్తున్నారు. అయితే సినిమా లెక్కలుకు,అభిమానానికి పొంతన ఉండదనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ బిజీలో ఉన్నారు. ఆ చిత్రం అనంతరం పూరీ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే చిత్రంలో నటించనున్నారు.
English summary
Pawan's latest movie Panja is going to be dubbed as 'Kuri' in Tamil.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST