ఈరోజు చెన్నైలో రాజమౌళి ప్రెస్ మీట్

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 10:52 [IST]
రాజమౌళి ఈ రోజు (సోమవారం) చెన్నైలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ విషయమై ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ... ఈగ పోస్ట్ ప్రొడక్షన్ బాగా వచ్చింది. ఈగ లుకింగ్ గుడ్. ఈ రోజు తమిళ వెర్షన్ నానే ప్రెస్ మీట్ కోసం చెన్నైకి వెళ్తున్నా అన్నారు. ఇక ఈగ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఇక ‘ఈగ’ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.
English summary
SS Raja Mouli tweets---Post production shaping up well.shots of eega looking good.going to chennai on Monday for a press meet of nani.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST