twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డ్రీమ్ గర్ల్’ హోదా సొంతం చేసుకున్న హన్సిక

    By Bojja Kumar
    |

    హీరోయిన్‌గా మంచి స్థాయికి ఎదగాలని హీరోయిన్ హన్సిక చేస్తున్న ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలో జోరుగా రాణిస్తున్న ఈ భామ...తమిళ ప్రేక్షకుల ఆరాధ్య హీరోయిన్ కావాలని ఎప్పటి నుంచో కలలు కంటోంది. తాజాగా ఆమె కల ఫలించింది. సింగపూర్ తమిళ అసోసియేషన్ వారు ఈ క్యూట్ భామకు 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ తమిళ సినిమా'హోదా ఇచ్చారు. అభిమానులు తనను డ్రీమ్ గర్ల్‌గా పిలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హన్సిక ఉబ్బితబ్బిబ్బవుతోంది.

    తమిళులు హీరోయిన్లపై చూపే అభిమానం అంతా ఇంతా కాదు. వారికి నచ్చితే అందలం ఎక్కించడమే కాదు, దేవాలయాలు నిర్మించి పూజలు కూడా చేశారు. కష్భూతో పాటు చాలా మంది హీరోయిన్లు తమిళుల మనుసు దోచి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. తాజాగా ఆ లిస్టులో హన్సిక కూడా చేరింది. వారికి బొద్దుగా, బాగా కండ పట్టి మంచి షేపులు ఉన్న పిటపిటలాడే హీరోయిన్లు అంటే చాలా ఇష్టం అందుకే హన్సికను అంతలా ఇష్ట పడుతున్నారు.

    ప్రస్తుతం హన్సిక తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపొందబోయే..'దొరకడు' చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. అదే విధంగా తమిళంలో 'ఓకే..ఓకే' అనే చిత్రంలో నటిస్తోంది.

    English summary
    Hansika has been voted as the ‘Dream Girl’ of Tamil Cinema by a Tamil Association in Singapore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X