twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'బృందావనం' తమిళంలో ఆ హీరోతో

    By Srikanya
    |

    ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బృందావనం'. తెలుగులో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. ప్రముఖ స్టార్ హీరో, రాజకీయవేత్త విజయ్‌కాంత్ ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కుల్ని పొందారు. ఆయన కుమారుడు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్‌కాంత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళ స్టార్ డైరక్టర్ ఒకరికి ఈ రీమేక్‌కు భాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. తెలుగులో హీరోయిన్స్ గా నటించిన సమంతా, కాజల్ స్థానంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా నిర్ణయం కాలేదు.

    ఇక జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన బృందావనం చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు ట్రై చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ ఈ చిత్రం రైట్స్ తీసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు చేసినట్లు తెలిసిందే. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ మాస్ హీరో చేయటం వారిని బాగా ఆకర్షించింది. మరో ప్రక్క బొమ్మరిల్లు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఎడిటర్ మోహన్ కూడా ఈ చిత్రం రైట్స్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఫ్యాన్సీ రేటుకు విజయ్ కాంత్ ఈ చిత్రాన్ని తీసుకుని ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు.

    ఇక గత కొంతకాలంగా తెలుగు చిత్రాల రీమేక్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హిందీ,తమిళ భాషలవారు ఎప్పటికప్పుడు ఇక్కడ చిత్రాలను రీమేక్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో పోకిరి రీమేక్ హిట్టైన దగ్గర నుంచి వారు ఇక్కడ రిలీజయ్యే చిత్రాల పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. తమిళ హీరోలైతే ఇక్కడ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ రోజున ఎంక్వైరీ చేసుకుంటున్నారు. హిట్ టాక్ వస్తే వెంటనే తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన హీరోల చిత్రాలు అక్కడ ఒకేసారి రిలీజవుతున్న నేపధ్యంలో రీమేక్స్ తగ్గే అవకాశం ఉంది.

    English summary
    NTR-Kajal Aggarwal- Samantha starrer Brindavanam is soon going to be remade into Tamil. Actor turned politician, Vijaykanth has reportedly bought the remake rights of the film for a whopping price. The superstar has decided to launch his son Shanmuga Pandian's movie career. Apparently Vijaykanth is in discussions with a couple of big ticket Tamil directors at the moment and will make an announcement soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X