twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పిపోయిన కొడుకుని దొరికేలా చేసిన చిత్రం

    By Srikanya
    |

    చెన్నై: ఒక్కోసారి నిజ జీవిత కథలే సినిమా తెరకెక్కుతూంటాయి. అయితే సినిమాలు కూడా నిజ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలకు అంకురార్బణ చేస్తూంటాయి. ఆ కోవలో ఓ సంఘటన రీసెంట్ గా చెన్నైలో చోటు చేసుకుంది. సురేష్ కొండేది తెలుగులో అనువదించి విడుదల చేసిన 'వజక్కు ఎన్ 18/9'(తెలుగులో 'ప్రేమలో పడితే') తప్పిపోయిన ఓ పిల్లవడాన్ని ఆ కుటుంబానికి చేర్చింది.

    అదెలా జరిగింది అంటే....చెన్నైకి చెందిన అన్బు.. ఓ మానసిక వికలాంగుడు. ఆరేళ్ల క్రితం తప్పిపోయాడు. తల్లిదండ్రులు అన్బు కోసం ఎంతగానో వెతికారు. దొరకలేదు. మొన్న వినాయకచవితి నాడు ఇంట్లో వాళ్లందరూ టీవీలో 'వజక్కు ఎన్ 18/9'(తెలుగులో 'ప్రేమలో పడితే') సినిమా వస్తుంటే.. చూశారు. ఆశ్చర్యం. ఆ సినిమాలో అన్బు. అదీ నటుడిగా..ఆ సినిమా విడిపోయిన వారిని మళ్లీ కలిపింది. మరోసారి ఆ కుటుంబమంతా ఏకమైంది. ఈ సంఘటన తమిళనాడులో నిజంగానే జరిగింది. ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.

    తిర్పూర్‌కు చెందిన లోకనాథన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అన్బు, కవిత. 2006లో వారు చెన్నైకి వెళ్లినప్పుడు అన్బు(అప్పటికి ఆ బాలుడి వయసు 4 ఏళ్లు) తప్పిపోయాడు. ఎంతగానో వెతికారు. దొరకలేదు. దీంతో నిరాశగా ఇంటికి వెనుదిరిగారు. అటు రోడ్డు మీద ఏడుస్తూ కనిపించిన అన్బును పిల్లల సంక్షేమ కమిటీ వాళ్లు చూసి.. మానసిక వికలాంగుల కోసం ఉద్దేశించిన 'బాలవిహార్' స్కూల్లో చేర్చారు. పేపర్లో అతడి గురించి ప్రకటనలిచ్చారు. ఎవరూ రాలేదు. ఇలా కొన్నేళ్లు గడిచాయి.

    ఓ రోజు ప్రేమిస్తే చిత్ర దర్శకుడు దర్శకుడు బాలాజీ శక్తివేల్ ''ప్రేమలో పడితే' సినిమాలో హీరోయిన్ ఇంటి పక్కనుండే అబ్బాయి పాత్ర కోసం మానసిక వికలాంగుడైన బాలుడి గురించి వెతుకుతున్నారు. బాలవిహార్‌ను సంప్రదించారు. వారు అన్బు పేరును సిఫార్సు చేశారు. అలా అన్బు ఆ సినిమాల్లో భాగమైపోయాడు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజై పోయింది. మొన్న వినాయకచవితినాడు ఓ చానల్‌లో ఈ సినిమాను వేశారు. సినిమాల్లో జరిగేటట్లుగానే.. ఇక్కడ కూడా అన్బు కుటుంబ సభ్యులు ఆ చిత్రాన్ని చూశారు.

    హీరోయిన్ పక్కన అన్బు. మన అన్బు టీవీలో.. అంటూ ఆ కుటుంబ సబ్యులు ఎగిరిగంతేశారు. ఆ తర్వాత దర్శకుడిని సంప్రదించారు. విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. బాలవిహార్ నిర్వాహకులు వాళ్లు అన్బు తల్లిదండ్రులేనని నిర్ధారించుకున్నారు. ఈ నెల 4న అన్బును వాళ్లింటికి పంపారు. మానసిక వికలాంగులైన పిల్లల విషయంలో ఎలా నడుచుకోవాలన్నది చెప్పారు. అన్బును స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయమని తండ్రికి సూచించారు. ఇదీ కథ.

    English summary
    The boy was went missing 6 year ago, was reunited with his family after they saw him in 'Premalo Padithe'.This story of a family reunion could make a good script for a blockbuster film - a young, differently-abled boy, who went missing six years ago, was reunited with his family after they saw him in a Tamil film 'Premalo Padithe'. The movie was recently telecast recently on TV on the occasion of Ganesha Mahotsav. Anbu, a four-year-old then, had strayed away from his family, who had come to Chennai in 2006 for a vacation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X