twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ కోసం తెలుగు హీరోల స్ట్రాటజీనే కార్తీ కూడా...

    By Srikanya
    |

    చెన్నై : తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో కార్తీ. అయితే ఆయనకు రీసెంట్ గా హిట్ అనేది కరువైంది. వచ్చిన ప్రతీ సినిమా బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన 'బ్యాడ్ బోయ్ ' ఆయన్ను మరింత నిరాశలోకి నెట్టింది. దాంతో ఎక్కువ సినిమాలు చేస్తే అందులో కొన్నైనా హిట్ అయ్యి...తనని నిలబెడతాయనే స్టాటజీకి తెర తీస్తున్నాడు. ఇప్పటికే ఈ స్టాటజీని తెలుగులో హీరోలు పాటిస్తున్నారు.

    ఈ నేఫద్యంలో కార్తీ విజయం కోసం తహతహలాడుతున్నాడు. హిట్‌ అనివార్యమైన నేపథ్యంలో సినిమాల సంఖ్య కూడా పెంచాడు. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'బిరియాని'లో నటిస్తున్నాడు. చివరి దశలో ఉంది. మరోవైపు రాజేష్‌ దర్శకత్వంలో 'ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా' చేస్తున్నాడు. మరో కొత్తకథకు కూడా పచ్చజెండా వూపినట్లు సమాచారం.

    'అట్టకత్తి'లాంటి వైవిధ్య చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రంజిత్‌. స్టార్ హీరోలు లేకున్నా ప్రేక్షకులను మెప్పించటంలో విజయవంతమైంది. రంజిత్‌ దర్శకత్వంలో కార్తీ నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 'సాప్పాట్టు పరంబరై' అన్న పేరు ఖరారు చేసినట్లు సమాచారం.

    'ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా' తర్వాత కార్తీ నటించే కొత్త సినిమా ఇదేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి. ఈ చిత్రాన్ని సైతం తెలుగు,తమిళ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Pa Ranjith seems to have struck a gold in his first attempt Attakathi, as the young director has bagged a film, which will star a A-list actor. Well, he has been signed to direct a film starring none other than Karthi. The buzz says that Gnanavel Raja has given a nod to a story narrated by Pa Ranjith and the producer has roped in Karthi to star in the movie. Confirming the news, the director claimed that the news is true and he is all set to team up with Karthi and Raja. The project will focus on Chennai's real heroes, adds the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X