twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళంలో మహేష్ క్రేజ్ పెంచటానికే ఈ స్ట్రాటజీ

    By Srikanya
    |

    చెన్నై : ఇప్పుడు ప్రతీ హీరో తమిళ,తెలుగు మార్కెట్లు రెండింటినీ కోరుకుంటున్నారు. దీనికి మహేష్ అతీతుడు కాదు. ఆయన చిత్రాలు తమిళ నాట కూడా బాగా ఆడటంతో అక్కడ కూడా మార్కెట్ ని విస్తరించుకోవాలనే యోచనలో ఉన్నారు. దానికి తోడు తమిళ హీరో లు సైతం ఇక్కడ మార్కెట్ పై కన్నేస్తున్నారు.

    దీన్ని దృష్టిలో పెట్టుుకునే మహేష్ బాబు,జయంత్ సి.పరాంన్జీ కాంబినేషన్ లో రూపొందిన టక్కరి దొంగ చిత్రాన్ని తమిళంలో ఈ రోజే విడుదల చేస్తున్నారు. తెలుగులో పెద్దగా ఈ చిత్రం ఆడకపోయినా మంచిపేరు తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని వెట్రి వీరన్ టైటిల్ తో ఈ రోజు డబ్బింగ్ చేసి తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో మహేష్ కు క్రేజ్ పెంచటానికే ఆయన పి.ఆర్ టీమ్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుందని వినిపిస్తోంది.

    మహేష్‌బాబు నటించిన బిజినెస్‌మేన్‌ అదే పేరుతోనూ, దూకుడు 'అదిరడివేట్త్టె'గా ఇంతకుముందు విడుదల అయ్యాయి. అయితే అవి అక్కడ ఫెయిలయ్యాయి. అయినా ఈ ప్రయత్నం వృధా కాదంటున్నారు. అనువాద చిత్రాలకు సంబంధించి ఓ నిర్మాత మాట్లాడుతూ.. చెన్నైతో పాటు శివారులో నివసించే తెలుగు ప్రజలు, ఇక్కడ సుమారు 50 కళాశాలల్లో 20 శాతం మేర ఉన్న తెలుగు విద్యార్థుల నుంచి చక్కని ఆదరణ లభిస్తోందని చెప్పారు.

    తెలుగులో విజయం సాధించిన 'హనుమాన్‌ జంక్షన్‌' ఇదివరకే శరత్‌కుమార్‌, నెప్పోలియన్‌ కాంబినేషన్లో 'తెన్కాశిపట్టణం'గా వచ్చింది. తెలుగు హనుమాన్‌ జంక్షన్‌ను 'సింగకోటె' పేరుతో అనువదిస్తే ఆశ్చర్యంగా మంచి లాభాలు తెచ్చిపెట్టిందని ప్రస్తావించారు. 'అరుంధతి' విజయంతో తెలుగు అనువాదాలకు మరింత వూపునిచ్చిందని వివరించారు

    English summary
    PR’s team of Mahesh is working hard to create strong south market for his films. Almost all movies of Mahesh are being planned to release in Tamil at any cost. Now Takkari Donga is getting dubbed and releasing in Tamil as Vetri Veeran to enthrill Tamil thambi’s. Mahesh recent released Dookudu budded Athiradi Vettai boomed at TAMIL BOX OFFICE.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X