twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం-2'తో సమస్యలుండవని చెప్తోంది

    By Srikanya
    |

    చెన్నై : కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు విశ్వరూపం-2ని తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు కమల్‌. ఈ చిత్రం కొనసాగింపు భాగం త్వరలోనే తెరపైకి రానుంది. కమల్‌ ఈ పనుల్లో తలమునకలై ఉన్నారు. రెండో భాగంలో ఎలాంటి సమస్యాత్మక విషయాలు ఉండవని చెబుతోంది హీరోయిన్ పూజాకుమార్‌.

    పూజా కుమార్ మాట్లాడుతూ... తొలిభాగంలో ఎలాంటి అవాంఛనీయ సన్నివేశాలు లేవు. కొన్నివర్గాల వల్ల సమస్యాత్మకంగా మారింది. 'విశ్వరూపం-2'కు అలాంటి పరిస్థితి ఎదురవదని నమ్ముతున్నా. మనం స్వతంత్ర దేశంలో జీవిస్తున్నాం. మంచి అభిప్రాయాలను చెప్పే హక్కు మనకుంటుంది. అదే హక్కుతోనే కమల్‌ 'విశ్వరూపం' తెరకెక్కించారు. ఒకవేళ అసత్యమో, తప్పుడు అభిప్రాయాన్నో తెరకెక్కిస్తే దాన్ని తొలగించేందుకు సెన్సార్‌ బోర్డు ఉంది. ఇక్కడ చాలామంది సెన్సార్‌ అంగీకారం పొందాక కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారనే విషయం అర్థమవుతోంది. రెండోభాగం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది.

    కమల్ మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

    ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

    విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

    English summary
    "I don't think there is anything controversial in 'Vishwaroopam 2' film. Neither was it in the first one," says Pooja Kumar, and elaborates, "See, we live in a democratic country so everyone has a right to expression. We all have the freedom to exercise it. That is why Kamal sir is a filmmaker and he should be granted that freedom to show the world what his feeling and his thoughts are. And most of all, there is a Board of Certification that has granted the film a certificate to be shown to the public. And they have been appointed and trained to allow only those films to be shown which are for the entertainment and the welfare of the audiences. They know the sentiments of the Indian populace and what's good for them and what is not. So, how can anyone question their ability to judge a film? And I'm really glad they stood by us.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X