twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాపుల దెబ్బకు కొత్త హీరోలైనా సై అంటోంది

    By Srikanya
    |

    Amala Paul
    చెన్నై : సినిమా పరిశ్రమలో పరాజయం ఎయిడ్స్ కన్నా ప్రమాదకరం. ఫ్లాప్ లలో ఉన్న హీరో,దర్శకుడు,హీరోయిన్ ని పలకరించటానికి కూడా ఎవరూ ఇష్టపడరు. ఈ నేపధ్యంలో హీరో,హీరోయిన్స్ తమ పారితోషికాలు తగ్గించుకోవటం, తమ డిమాండ్స్ ని కంట్రోలలో పెట్టుకోవటం వంటివి చేస్తారు. ప్రస్తుతం అమలా పాల్ అదే స్టేజిలో ఉంది.

    నాకు కథే ముఖ్యం కాని.. హీరో కాదు. సో కొత్త హీరోల సరసన నటించేందుకు కూడా సిద్ధమే అని తన నిర్ణయాన్ని ప్రకటించింది అమలాపాల్‌. 'మైనా'తో మెప్పించిన అమలాపాల్‌పై కోలీవుడ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితో ఎన్నో అంచనాలతో వచ్చిన 'తలైవా' (అన్న)అమ్మడ్ని నిరాశపర్చటంతో పాటు, భారీగా వస్తాయనుకున్న అవకాశాలూ వచ్చి చేరలేదు. ప్రస్తుతం అవకాశాలు తక్కువైన నేపథ్యంలో కథ నచ్చితే కొత్త హీరోలతో నటించేందుకై సై అని చెబుతోంది.

    అమలాపాల్ మాట్లాడుతూ.. తమిళం, తెలుగు, మలయాళం అంటూ మూడు చిత్రాల్లో నటిస్తున్నాను. ఏ భాషలో నటించినా మంచి చిత్రాల్లో నటించాలన్నదే నాకు ముఖ్యం. అటువంటి కథలు వచ్చినప్పుడు హీరోకు ప్రాధాన్యత ఇవ్వను. కొత్త హీరో సరసనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

    నాన్న, ఇద్దరమ్మాయిలతో ,బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయిక్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ ...అమలా పాల్. అయితే ఆమెకు తెలుగు నుండి ఆమెకు సరైన ఆఫర్స్ రావటం లేదు. దాంతో తమిళం వైపే మళ్లీ మ్రొగ్గుచూపింది. తాజాగా తమిళ తెరపై ప్రభంజనం సృష్టిస్తున్న హీరో శివకార్తికేయన్ తో ఆమె కమిటైంది‌. శివ తొలిసారిగా పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నాడు. తరచూ హాస్య పాత్రల్లో కనిపిస్తున్న తాను.. భిన్నంగా కనిపించాలనే ఈ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే మోహన్ లాల్ తో ఓ మళయాళ చిత్రం సైతం కమిటైంది.

    ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్‌. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో 'బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర కథానాయకల్లా గ్లామరస్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.

    తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్‌ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్‌ అయ్యింది. ఇటీవల 'దైవ తిరుమగల్‌'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో 'నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

    English summary
    
 In her short career, Amala Paul has already bagged projects with big stars like Vijay, Jayam Ravi and Arya in Tamil and with almost all Telugu superstars as well. But, she insists that she isn’t bound just by big directors and big stars. If the script and character is apt for her, she doesn’t mind acting with newcomers as well. She feels that she isn’t in a position to dictate her pair in a movie as she doesn’t have that much experience yet. The choice of the hero for a film rests with the director and the producer and not with her, Amala asserts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X