Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

నాది ప్రేమ వివాహమే కానీ... : అమలాపాల్‌

Posted by:
Published: Tuesday, October 22, 2013, 9:27 [IST]

నాది ప్రేమ వివాహమే  కానీ...  : అమలాపాల్‌
 

చెన్నై : ''పెళ్లంటే నాకు చాలా ఇష్టం. నా స్నేహితుల వివాహాలకు వెళ్లినప్పుడు నన్ను నేను వధువుగా వూహించుకుంటా. ఆ హంగామా చూస్తే చాలా ఆనందమేస్తుంది. నేను ఎవర్నో ప్రేమిస్తున్నట్లు గాలి వార్తలు వస్తున్నాయి. నేను అమ్మాయిల పాఠశాల, కళాశాలలోనే చదివాను. ప్రేమ వ్యహారాలేవీ లేవు. తొలిచూపులోనే నన్ను ఆకట్టుకునే యువకుణ్ని పెళ్లి చేసుకుంటా. అతడి కోసం వేచి చూస్తున్నా. నేను ఆశించిన సద్గుణాలున్న వ్యక్తి కనిపిస్తే తప్పకుండా ప్రేమించే వివాహం చేసుకుంటాను''అని అమలాపాల్ చెప్పింది.

దర్శకుడు విజయ్‌, అమలాపాల్‌ సన్నిహితంగా ఉన్నారని, ప్రేమలో పడ్డారంటూ 'నాన్న ' చిత్రం నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిని అమలాపాల్ ఖండిస్తూనే ఉంది.అమలాపాల్ మాట్లాడుతూ.. కథానుగుణంగా వెండితెరపై పరిణతి గల పాత్రల్లో కనిపిస్తాను. నిజ జీవితంలో నేనింకా చిన్నపిల్లనే. ప్రేమించే వయసు రాలేదు. దర్శకుడుకీ,హీరోయిన్ కి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే మా ఇధ్దరి మధ్య ఉంది. అంతకు మించి ఊహలు అనవసరం అంటూ తేల్చి చెప్పింది.

తెలుగు,తమిళ భాషల్లో ఇప్పుడు పాపులర్ గ్లామర్ హీరోయిన్ ఎవరంటే కేరళ కుట్టి అమలా పాల్ పేరు చెప్తారు. తమిళంలో 'మైనా',తెలుగుల ఇద్దరమ్మాయిలు తర్వాత అమలాపాల్‌ స్టార్‌డం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం తమిళం, తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ హవా చాటుకుంటోంది. ఇటీవల విజయ్‌తో నటించిన 'తలైవా' కూడా మంచి గుర్తింపు తీసుకురావడంతో పెద్ద చిత్రాల అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పెళ్లి విషయాన్ని ఈ కేరళకుట్టి వద్ద ప్రస్తావిస్తే.. ఇలా స్పందించింది.

తాజాగా 'తలైవా'(అన్న) లో రెండు పాత్రల్లో భిన్నమైన నటన ప్రదర్శించి శెభాష్‌ అనిపించుకున్న అమలా పాల్ ఇప్పుడు హైలీ డిమాండెడ్ హీరోయిన్. తానలా నటించడానికి విజయ్‌ కూడా ఓ కారణమని చెబుతోంది అమలాపాల్‌. అమలా పాల్ మాట్లాడుతూ...నేను చిన్న నటిని. విజయ్‌లాంటి స్టార్ హీరోల సరసన అవకాశం దక్కడం నిజంగా అదృష్టం. షూటింగ్‌ స్పాట్‌లో, నటించేటప్పుడు, డ్యాన్స్‌ చేసేటప్పుడు విజయ్‌ ఎలా ఉంటారోనని భయపడేదాన్ని. ఎలాంటి భేషజాలు లేకుండా కలసిపోయారు. కొన్ని సందర్భాలల్లో ఆశించిన స్థాయిలో నటించలేకపోయా. అప్పుడు విజయ్‌ చిట్కాలు నేర్పారు. ఆ తర్వాత చాలా సులువుగా నటించేశా. స్టార్ హీరోలతో నటించేటప్పుడు నేనుకూడా నటనలో అభివృద్ధి చెందుతున్నాననేనమ్మకం వస్తోందని చెప్పారు.

English summary
Amala Paul and her love affair with director Vijay is being spread like wildfire by gossipers. Despite both of them denying being in love with each other, the rumors are not coming to an end. When the lady was asked about her marriage plans, she said that marriage will happen only after she completes at least hundred films. Making a mark in the film industry is the priority now and there is no room for marriage now, Amala has said.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice