twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మనం' డైరక్టర్ నెక్ట్స్ ప్రాజెక్టు ఖరారు(అఫీషియల్)

    By Srikanya
    |

    చెన్నై: 'మనం' చిత్రంలో హిట్ కొట్టి ప్రశంసలు అందుకున్న విక్రమ్ కుమార్ తదుపరి చిత్రం వెంటనే ప్రారంభం కాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే విక్రమ్ కుమార్ మాత్రం కథ తయారు చేసుకుని మహేష్ వంటి హీరోలను ఎప్రోచ్ అయ్యాడు కానీ మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపధ్యంలో తమిళ హీరో సూర్య వచ్చి విక్రమ్ కుమార్ ప్రాజక్టుకి సైన్ చేసారు. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేసారు

    ఈ చిత్రం సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాణం కానుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై పాండ్యరాజ్ దర్సకత్వంలో ఓ లొ డడ్జెట్ పిల్ల చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల అనంతంర విక్రమ్ తో ప్రారంభమయ్యే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ లోగా సూర్య తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసుకుని వస్తారు.

    'Manam' director to team up with Suriya

    అజిత్‌, విజయ్‌ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన లింగుస్వామి దర్శకత్వంలో నటించిన 'అంజాన్‌' నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఎప్పటినుంచో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలైంది.

    'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్‌ప్రభు తాజాగా సూర్యతో మాస్‌మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్‌' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్‌ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార, ఎమీజాక్సన్‌ నటిస్తున్నారు. ఎప్పటిలాగే వెంకట్‌ప్రభు తమ్ముడు ప్రేమ్‌జీ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

    English summary
    "Manam", filmmaker Vikram Kumar will next team up with actor Suriya for an untitled Tamil project.The film would be produced by Suriya's home banner 2D Entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X