twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడుగా దేశంలో టాప్ రెమ్యునేషన్ మనోడిదే

    By Srikanya
    |

    చెన్నై : ప్రస్తుత సినీ రంగంలో విజయంతమైన దర్శకుల పేరు ఓ బ్రాండ్‌గా మారింది. ఈ క్రమంలో ప్రభుదేవా దేశంలోనే అధిక మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న దర్శకుడిగా ముందు వరసలో ఉన్నారు. నృత్య దర్శకుడిగా దేశాన్ని ఓ ఊపు ఊపి ఆ క్రేజ్‌తో హీరోగా తెరంగేట్రం చేసిన ప్రభుదేవా... అక్కడా తన సత్తా నిరూపించుకున్నారు. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో మెగాఫోన్‌ పట్టుకుని విజయం అందుకున్నారు. తెలుగు, తమిళం కంటే ఆయన బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 30 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

    'వాంటెడ్‌', 'రౌడీ రాథోడ్‌' తదితర చిత్రాలన్నీ రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ప్రభుదేవా ప్రస్తుతం అక్కడ డిమాండ్‌ ఉన్న దర్శకుడు. ప్రభుదేవాపై అక్కడి బడా నిర్మాతలు నమ్మకం పెంచుకోవడంతో ప్రస్తుతం ఆయన రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఆయన తర్వాతి స్థానంలో రూ.15 కోట్లతో కోలీవుడ్‌కే చెందిన శంకర్‌ ఈ జాబితాలో ఉన్నారని సమాచారం.

    సినిమా అనే షిప్‌కు కెప్టెన్‌ దర్శకుడే. అయితే హీరో డామినేషన్‌ అధికంగా ఉండే ఈ రంగంలో పాత రోజుల్లో దర్శకుడు కూడా అందరిలో ఒక సాంకేతిక నిపుణుడిగానే మిగిపోయాడు. కోలీవుడ్‌లో కె.బాలచందర్‌, భారతిరాజా, తెలుగులో కె.విశ్వనాథ్‌, బాపు - రమణ, దాసరి నారాయణరావు తదితరుల రాకతో ప్రేక్షకులు దర్శకుడి పేరు చూసి సినిమాకు వచ్చే రోజులు ప్రారంభమయ్యాయి.

     Shocking remuneration for Prabhu Deva!

    నృత్య దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి 'ప్రేమికుడు‌'గా ప్రేక్షకుల మనసుదోచిన ప్రభుదేవా టాలీవుడ్‌లో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో దర్శకుడిగా మారాడు. తెలుగులో పౌర్ణమి, తమిళంలో పోక్కిరి, విల్లు వంటి చిత్రాలను తెరకెక్కించాడు. హిందీలో వాంటెడ్‌, రౌడీ రాథోడ్‌ చిత్రాలతో రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతానికి హిందీ చిత్రసీమపైనే దృష్టి సారించిన ఆయన అక్కడికే మకాం మార్చాడు.

    ప్రభుదేవా మాట్లాడుతూ.... '' అన్నీ మాస్‌ చిత్రాలనే తీసున్నారని నాతో చాలామంది అంటున్నారు. సున్నితమైన కుటుంబ కథలను నా నుంచి ఆశించలేమా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. అనురాగాలు, ఆప్యాయతల కలయికగా ఉండే అలాంటి సినిమాలూ తెరకెక్కించాలని నాక్కూడా ఆశే. నిర్మాతలు అలాంటి కథలపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. యాక్షన్‌, మాస్‌ మసాలా చిత్రాలకే పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు. వారి అభిరుచి మేరకే నేనూ అలాంటి సినిమాలకే మెగాఫోన్‌ పట్టుకుంటున్నా''అని చెప్పాడు.

    ఇక పెళ్లి- విడాకులు, ప్రేమ- వైఫల్యం తర్వాత మరో కొత్తలోకానికి వచ్చానని చెబుతున్నాడు. పిల్లలు, వారి భవిష్యత్తే లోకమని చెబుతున్నాడు. అంతా దైవ నిర్ణయమని, ఏది జరిగినా తన మంచికే అంటున్నాడు. గతంలో జరిగిన సంఘటనల ద్వారా నేర్చుకున్నదేమిటి అన్న విషయానికి సమాధాన మిస్తూ... జరిగిన దాని గురించి ఏమాత్రం చింతించడం లేదు. వాటినే గుర్తు చేసుకుని భవిష్యత్తును భారంగా గడపట్లేదు. అదంతా దేవుడి నిర్ణయం అని చెప్పారు. నేను ఏదీ కోల్పోలేదు. నా ప్రపంచం నా పిల్లలే. అంతకు మించి పెద్దదేమీ లేదు అని తేల్చి చెప్తున్నారు.

    English summary
    
 Prabhu Deva, who has become a much talked about director, his salary has also grew up to a great extent and has reached 30 crores for a film now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X