twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1930 కాలం కథతో సిద్దార్ద చిత్రం.. ఫస్ట్ లుక్

    By Srikanya
    |

    చెన్నై : హీరో సిద్దార్ద గత కొంత కాలంగా కెరీర్ పరంగా వెనకపడిపోయారు. భాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలేమీ సరైన ఫలితాలు ఇవ్వటం లేదు. ఈ నేపధ్యంలో ఆయన ప్రయోగాత్మక చిత్రంపై దృష్టి పెట్టారు. రంగస్ధల కధాంశంతో ఓ చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు వంసంత భాలన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'కావియ తలైవన్‌' ( 'అనగనగా ఓ నాటక బృందం..' ) టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1930ల కాలానికి చెందిన నాటక కళాకారుల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    బాలా తర్వాత వైవిధ్య, వాస్తవిక చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు...తమిళంలో వసంతబాలన్‌. 'షాపింగ్ మాల్', 'ఏకవీర‌'.. వంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన వసంతబాలన్‌ నాటి రంగస్థల వైభవంపై దృష్టి పెట్టారు.ఏఆర్‌ రెహమాన్‌ను ఆకర్షించిన ఈ చిత్రకథ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రెహమాన్‌ ఒకటికి పదిమార్లు ఆలోచించి బాణీలు కడుతున్నారట. సిద్ధార్థ్‌, పృథ్వీరాజ్‌ హీరోలుగా నటిస్తున్నారు. వేదిక, అనైక కథానాయికలు. వీరితోపాటు సంతానం, నాజర్‌, తంబిరామయ్య, సింగంపులి, పొన్‌వన్నన్‌ వంటి పెద్దస్థాయి నటీనటులు కీలకపాత్రలు పోషించారు.

    Siddharth in Vasanthabalan 'Kaaviya Thalaivan'

    ఎఆర్ రహమాన్ మాట్లాడుతూ... 'కావియ తలైవన్‌' చిత్ర కథను వసంతబాలన్‌ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. ఈ సినిమాకు సంగీతం సమకూర్చాలని అడిగారు. కానీ అప్పుడు హాలీవుడ్‌ చిత్రం ఒప్పుకున్నా. ఈ సినిమాకు చేయాలంటే దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. చివరకు అదే చేశా. అంతగా నచ్చిందీ చిత్రం. చిన్న పాటలతోపాటు మొత్తం 20 వరకు ఉన్నాయి. అప్పట్లో సంగీతానికంటూ ఓ శైలి ఉండేది. దాన్ని పసిగట్టి సంగీతం అందించడం సవాలుగా అనిపించి ఒప్పుకున్నా. ఏ రాగంలో సంగీతం సమకూర్చాలో ఆలోచించేందుకు సమయం ఎక్కువ పడుతోంది.

    దర్శకుడు వసంతబాలన్‌ మాట్లాడుతూ... ఇది ఎంతో ఇష్టపడి ఎంచుకున్న కథ. 1930ల కాలానికి చెందిన నాటక కళాకారుల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా. ప్రతి చిన్న విషయం కూడా పరిశీలనగా చేస్తున్నా. నిజంగానే సవాలుతో కూడుకున్న అంశమిది. అప్పటి రంగస్థల కళాకారుల వల్ల కలిగిన ప్రయోజనాలు, వారు ఎదుర్కొన్న కష్టాలను ఇందులో ప్రస్తావించా. దక్షిణాది ప్రేక్షకులను అమితంగా నచ్చుతుందనే ఉద్దేశంతో దీన్ని తీస్తున్నాను అన్నారు.

    English summary
    Director vasantha balan latest film is 'Kaviya Thalaivan'. It was a historical fiction film,cast announced in last year december. Siddharth, Prithiviraj sukumaran and Vedhika in the lead role. Nassar and thambi ramaiah in the supporting role. music and background score composed by Oscar Winner AR Rahman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X