twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలో పాత్ర పేరే...నాకు మా అమ్మ పెట్టింది

    By Srikanya
    |

    Sivaji's connection behind Shankar's name
    చెన్నై : తమిళ,తెలుగు భాషల్లో అద్బుతమైన దర్శకుడిగా శంకర్‌ పేరుంది. అంతేకాదు దేశ స్థాయిలో ఆయన పేరు చెపితే బిజినెస్ అయ్యేలా ప్రత్యేక మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన పేరు వెనుక కథను ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు రజనీకాంత్ తో తను చేసిన చిత్రానికి శివాజి అనే పేరు పెట్టడానికి గల కారణం కూడా వివరించారు.

    శంకర్ మాట్లాడుతూ... '' నాకు, నడిగర్‌ తిలగం శివాజీగణేశన్‌కు విడదీయరాని బంధం ఉంది. మా అమ్మ శివాజీ అభిమాని. నేను కడుపులో ఉన్నప్పుడు శివాజీ నటించిన సినిమాకు వెళ్లారు. ఆ చిత్రంలో శివాజీ పాత్ర పేరు శంకర్‌. అప్పుడే పురిటినొప్పులు వచ్చాయి. నేను పుట్టాక నాకు శంకర్‌ అనే పేరు పెట్టారు'' అన్నారు.

    అలాగే నేను దర్శకుణ్ని అవ్వాలని అనుకున్న రోజుల్లో ఎలాగైనా శివాజీగారిని చూడాలని తపించేవాణ్ని. దర్శకుడిగా మారాక శివాజీతో సినిమా చేయాలనుకున్నా. ప్రభుదేవా నటించిన 'కాదలన్‌' (ప్రేమికుడు)చిత్రంలో ప్రభుదేవాకు తండ్రిగా ఆయన్ను నటింపజేయాలని ప్రారంభంలో అనుకున్నా. ఓ నటసింహానికి మేత వేసేంత పాత్ర కాదని భావించి ఆ ఆలోచనను పక్కనబెట్టా. కానీ శివాజీ చిత్రానికి దర్శకత్వం వహించలేకపోయానన్న ఆవేదన ఇప్పటికీ నాలో ఉంది. అందువల్లే రజనీ నటించిన చిత్రానికి 'శివాజీ' అని పేరుపెట్టాను''అని పేర్కొన్నారు.

    'ఐ' గురించి...

    శంకర్ సినిమాలంటే తమిళంలోనే కాదు,తెలుగులోనూ మంచి క్రేజు. బ్లాక్‌బస్టర్‌ దర్శకుడిగానే కాదు, భారీ బడ్జెట్‌ చిత్రాల మేకర్‌గా కూడా శంకర్‌కు పేరుంది. ఆయన రూపొందించిన వాటిలో బాయ్స్‌ మినహా జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు‌, భారతీయుడు‌, ఒకే ఒక్కడు‌, అపరిచితుడు‌, నన్బన్‌ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా 'ఐ' రూపొందిస్తున్నాడు. ఎమీ జాక్సన్‌ 'చియాన్‌' సరసన ఆడిపాడుతోంది.

    'అపరిచితుడు'గా విక్రంను తీసుకువచ్చి దక్షిణాదికే సుపరిచితం చేసిన శంకర్‌.. మళ్లీ 'ఐ'తో మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 'ఐ' కోసం నటుడు విక్రం సకలవిధాలా తనను తాను మలుచుకుంటున్నారు. కథకు తగ్గట్లు తన శరీరాకృతిని మార్చుకుంటున్నారట. మూడు భిన్న కోణాల్లో విక్రం కనిపించనున్నట్లు సమాచారం.

    English summary
    Director Shankar went on explain the reason behind his name in an interesting manner in a recent function. He said, my mom was an ardent fan of, Sivaji Ganesan. I was born on the day where she watched one of his movies and his character name was, Shankar. And, that is how I got the name from him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X