twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ టైటిల్ తో హీరో సూర్య చిత్రం

    By Srikanya
    |

    Surya
    చెన్నై : తన కొత్త సినిమా కోసం కమల్‌హాసన్‌ నటించిన చిత్రం శీర్షికను ఎంచుకున్నారు వెంకట్‌ప్రభు. 'బిరియాని' తర్వాత సూర్యతో తెరకెక్కించనున్న చిత్రానికి 'కల్యాణరామన్‌' అనే పేరు పెట్టారు. ఈ పేరుతో అప్పట్లో కమల్‌ హీరోగా ఓ చిత్రం వచ్చింది. పేరు పెట్టే ముందు కమల్‌తోపాటు ఆ చిత్ర దర్శకుడు పంజు అరుణాచలానికి కూడా విషయాన్ని వివరించారట వెంకట్‌ప్రభు. చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా బాణీలు సమకూర్చనున్నారు. ఇది రీమేక్‌ కాదని... పేరు మాత్రమే పాతదని, కథ కొత్తదేనని వెంకట్‌ప్రభు స్పష్టం చేస్తున్నారు.

    ఇక సూర్య తమ్ముడు కార్తీ చిత్రం బిర్యాని ప్రమోషన్ లో ..స్టూడియో గ్రీన్ బ్యాన్ త్వరలో ఓ స్టైయిట్ చిత్రం చేయనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో హీరో సూర్య. ఈ మేరకు దర్శకుడు వివి వినాయిక్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

    అలాగే 'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్‌ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.

    లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

    English summary
    Suriya’s next big project, post the currently under-production Lingusamy’s gangster movie, will be with director Venkat Prabhu. If what we hear is right, the title in consideration for this movie is Kalyana Raman. This in fact is the title of Kamal Haasan’s 1979 classic that also featured Sridevi, Manorama, Pushpalatha and VS Raghavan. In case Venkat Prabhu and team are planning to keep this title, they might have to get a clearance from the makers of the classic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X