twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

పోలీసులకు హీరో విశాల్‌ ఫిర్యాదు

By Srikanya

చెన్నై : లోకల్‌ కేబుల్‌ టీవీలో తమిళ కొత్త చిత్రాలను ప్రసారం చేయటంపై సినీ నటుడు విశాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొత్త సినిమా షూటింగ్‌ కోసం కారైక్కుడిలో ఉన్న విశాల్‌ ఉదయం స్థానిక పోలీసుష్టేషన్‌కు ప్రత్యక్షంగా వచ్చి ఓ ఫిర్యాదు అందజేశారు. చిత్రీకరణ అనంతరం తాను బస చేసిన గదిలో టీవీ ఆన్‌ చేశానని, అందులో లోకల్‌ కేబుల్‌ టీవీ ఛానల్‌లో 'వడకరి', మహారాజా అనే ఛానల్‌లో 'ఉన్‌ సమయలరయిల్‌' అనే కొత్త చిత్రాలు ప్రసారం అయ్యాయని పేర్కొన్నారు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందని, తగిన విచారణ జరిపి థియేటర్లలో ప్రసారమవుతున్న కొత్త చిత్రాలను ప్రసారం చేసిన రెండు సంస్థలపై చర్యలు చేపట్టాలని విశాల్‌ కోరారు.

హిట్ ఫ్లాపులతో సంభందం లేకుండా భాక్సాఫీస్ వద్ద వరస దండయాత్రలు చేస్తున్న విశాల్ మరో చిత్రం'ఇంద్రుడు'తో పలకరించారు. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో 'నాన్ సిగప్పు మనిదన్'టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్నే తెలుగులో 'ఇంద్రుడు'గా రిలీజ్ చేసారు.

Vishal fights against piracy

విశాల్‌ మాట్లాడుతూ ''తిరుతో మరోసారి జత కట్టడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ అంశాలు మేళవించిన ఓ ప్రేమ కథ ఇది. వినోదానికి ప్రాధాన్యం ఉంది. సాంకేతికంగానూ ఈ చిత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంది. కులుమనాలి, జోథ్‌పూర్‌, థాయ్‌లాండ్‌, చెన్నైలలో కీలక భాగం తెరకెక్కించాం. నా కెరీర్‌లో ఇది మర్చిపోలేని చిత్రం అవుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

Post by Masala Glitz.

English summary
Vishal has now joined the fight against piracy! Yes, while shooting at Karaikudi, Vishal was shocked to notice that Vadacurry and Un Samayal Arayil were broadcasted by local cable channels.Vishal and his team swung into action immediately and they lodged a complaint at the local police station.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X