twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెలివిజన్ చరిత్రలో మహేష్ బాబు మరో రికార్డ్

    By Srikanya
    |

    Athadu
    హైదరాబాద్ : మహేష్ బాబు తాజా చిత్రం 'నేనొక్కడినే' రిలీజ్ కు ముందే కోట్ల వ్యాపారం చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మహేష్ పాత చిత్రాలకు సైతం డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. మహేష్,త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అతడు' చిత్రం శాటిలైట్ రైట్స్ మరోసారి ఓ రేంజి రేటుకు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసిందని సమాచారం. మూడున్నర కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఈ సారి అమ్మారని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత కూడా ఈ రేటుకు అమ్మటం టీవి చరిత్రంలో రికార్డ్ అని చెప్తున్నారు.

    మహేష్ బాబు చిత్రం అతడు మా టీవీ లో రెగ్యులర్ గా వేస్తూంటారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి రెన్యువల్ చేయించుకోవటం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది తెలుగు టీవీ చరిత్రలో రికార్డు అంటున్నారు. ఎందుకంటే ఓ సినిమా రైట్స్ పీరియడ్ అయ్యిపోయిన తర్వాత అదే ఛానెల్ వారు దాన్ని రిపీట్ చెయ్యటానికి ఇష్టపడదు. కానీ 'అతడు' చిత్రం వేసేటప్పుడు వచ్చే యాడ్ రెవెన్యూ చూసి మా టీవి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.

    ఇక మాటీవికి తగ్గట్లే అతడు చిత్రం కూడా ఫ్యామిలీలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కుటుంబం అంతా కూర్చుని చూసేటట్లు కుటుంబ భావోద్వేగాలు,యాక్షన్,కామిడీ సినిమాను అన్నివర్గాలకు నచ్చే విధంగా ఉండటం ప్లస్ అయ్యింది. ఇక అతడు సినిమా రిలీజైనప్పుడు ఈ చిత్రం చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువైందని,అంతరేటుకు బిజినెస్ లేదని అప్పట్లో నిర్మాత మురళీ మోహన్ కంప్లైట్ చేసి ఇక సినిమాలు తీయనని ప్రకటించారు.

    ఆయన అన్నట్లే ఆ తరవాత సినిమాలు కూడా తీయలేదు. అయితే ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఇక ప్రస్తుతం మహేష్ తన నేనొక్కడినే చిత్రం హడావిడిలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కూడా మంచి రేటుకే శాటిలైట్ రైట్స్ అమ్ముడయినట్లు చెప్తున్నారు.

    English summary
    Maa TV had the satellite rights of Mahesh's popular movie Athadu. We hear that the TV wanted to renew its contract with the producer after 7 years and guess what? The film was sold for Rs 3.5 crores. Yes, the same film that starred Trisha in the female lead. When the movie was sold to Maa TV years ago, producer Murali Mohan got peanuts. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X