twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ఆదివారం టీవీలకు అతుక్కుపోతారు

    By Srikanya
    |

    హైదరాబాద్: వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నిస్తూ వచ్చిన ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ అలరించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఇప్పుడు బుల్లి తెర ప్రేక్షకులను అలరించటానికి సిద్దమవుతోంది. ఈ ఆదివారం...జీ టీవిలో సాయింత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రం టీఆర్పీలు చాలా బాగుంటాయిని భావిస్తున్నారు.

    చిత్రం కథేమిటంటే... అవినీతి, అక్రమాలులతో నిండిపోయిన రాజకీయ వ్యవస్దతో విసుగెత్తిన శ్రీను(నారా రోహిత్)... ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమీషనర్ (పోసాని) శ్రీను తో మాట్లాడి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమీషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు,మీడియా అంతా శ్రీను ని హీరోగా గా జేజేలు కొడతారు. మరోప్రక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు...ఎందుకిలా చేసాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయిటపడిన ఓ విషయం వారిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ వారు తెలుసుకున్న శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...శ్రీను కి సహకరించిన వారు ఎవరు...చివరకు ముఖ్యమంత్రిని వదిలేసారా...శ్రీను ని పోలీసులు ఏం చేసారు వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

    Prathinidhi entertains on small screen

    దర్శకుడు ప్రశాంత్ మండవ మాట్లాడుతూ... ''మంచి చెబితే ప్రేక్షకుడు స్వీకరించడు అన్నది అపోహ మాత్రమే. ఏదైనా సరే... వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. రోజూ చూసిన విషయాలే అయినా... మేం మరోసారి కొత్తగా గుర్తు చేద్దామనుకొన్నాం. ఆలోచన రేకెత్తించాలనుకొన్నాం. ఆ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది'' అన్నారు .

    అలాగే...''సగటు పౌరుడి ఆవేదనకి అద్దం పట్టే కథ ఇది. మనిషికి మనిషి సాయపడాలి అన్న ఓ చిన్న సందేశంతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. సందేశాలు చెబితే ప్రేక్షకులు వినే పరిస్థితి లేదన్న మాట తరచుగా వినిపిస్తుంటుంది. కానీ మేం ఆ విషయం గురించి భయపడలేదు. కథలో కొత్తదనం ఉంది. ఆలోచింపజేసే సత్తా ఉంది. అందుకే ధైర్యంగా ముందుకెళ్లాం. సినిమా థియేటర్‌ నుంచి బయటికొచ్చాక కూడా ప్రేక్షకులు కథ, కథనాల గురించి మాట్లాడుకొంటున్నారు. అక్కడే మేం విజయం సాధించాం. '' అన్నారు.

    బ్యానర్ :సుధామూవీస్‌ పతాకం
    నటీనటులు :నారా రోహిత్, శుబ్ర అయ్యప్ప, పోసాని కృష్ణమురళి, కోట, విష్ణువర్ధన్‌ తదితరులు
    కథ,మాటలు:ఆనంద్ రవి
    కెమెరా: చిట్టిబాబు,
    సంగీతం : సాయికార్తీక్‌
    ఎడిటింగ్‌: నందమూరి హరి.
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ మండవ
    సమర్పణ: గుమ్మడి రవీంద్రబాబు
    నిర్మాత: జె.సాంబశివరావు

    English summary
    Nara Rohit's ‘Prathinidhi’ film is all set to entertain on small screen on this coming Sunday. Zee Telugu is screening the film on 29th, June at 6.30 PM. Film starred Shubra Ayyappa and is produced by J.Samba Siva Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X