twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ని మళ్లీ రామ్ చరణ్ దాటేసాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: మహేష్ నటించిన 1 నేనొక్కడినే, రామ్ చరణ్ ఎవడు చిత్రం రెండూ భాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఎవడు హిట్ టాక్ తెచ్చుకుంటే నేనొక్కడినే ఫ్లాఫ్ అయ్యింది. కలెక్షన్స్ పరంగానూ ఎవడు తో పోలిస్తే...నేనొక్కడినే చిత్రం బాగా వెనకపడింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు సినిమాల మధ్య పోటీ వచ్చింది. మహేష్ నేనొక్కడినే చిత్రం జెమెనీ ఛానెల్ లో 5:30 ప్రసారమైన రోజే, మా ఛానెల్ లో ఎవడు చిత్రం 6 గంటలకు ప్రసారమైంది. అయితే ఈ సారి కూడా టీఆర్పీ లలో ఎవడుకే ఎక్కువ టీఆర్పీ వచ్చింది. ఎవడు చిత్రానికి 10.14 వస్తే... 1 నేనొక్కడినే చిత్రానికి 7.32 వచ్చింది. దాంతో టీవీల్లోనూ ఎవడు చిత్రమే పై చేయిగా ఉంది.

    ఇక మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో 'ఆగడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. తాజాగా ముంబై షెడ్యూల్ పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులకు థాంక్స్ చెబుతూ శ్రీను వైట్ల ట్విట్టర్లో ట్వీట్ చేసారు. జూన్ 15వ తేదీన ముంబై షెడ్యూల్ ప్రారంభమైంది. జూన్ 21 వరకు ముందుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ....అంతా కష్టపడి పని చేయడంతో జూన్ 17కే షూటింగ్ పూర్తయింది. ఇక్కడ సినిమాకు సంబంధించిన పలు సీన్లతో పాటు శృతి హాసన్ సాంగును కూడా ఈ సిటీలో చిత్రీకరించారు.

    Yevadu Beats 1 Nenokkadine TRP Ratings

    ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    Yevadu and 1 Nenokkadine were telecasted on TV’s on same day at the same time, 1 Nenokkadine was aired by Gemini Tv and Yevadu movie was telecasted my Maa Tv, both were telecasted with a gap of just 30 minutes. Now, official TRP ratings of the movies are out according to which Mahesh Babu’s 1 Nenokkadine has 7.32 TRP rating and Ram Charan’s Yevadu has a 10.14 rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X