చెన్నైచేరిన రెహ్మాన్ కు జయహో

గురువారం, ఫిబ్రవరి 26, 2009, 11:39 [IST]
AR Rahman
చెన్నై: రెండు ఆస్కార్లు సాధించి దేశ చలనచిత్రరంగ చరిత్రలో ఘనమైన స్థానం సంపాదించిన సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ఈరోజు తెల్లవారుజామున స్వదేశం చేరుకున్నారు. చెన్నైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎమిరేట్స్‌ విమానంలో తెల్లవారుజామున 2.30కు ఆయన విమానాశ్రయంలో దిగారు.

ఆయనకు తమిళనాడు ప్రభుత్వం తరపున సమాచారమంత్రి ఆయనకు స్వాగతం పలకగా డ్రమ్మర్‌ శివమణి తన ట్రూప్‌తో సంగీత స్వాగతం పలికి బయటకు తీసుకువచ్చారు. ఆయనకోసం అర్థరాత్రినుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు బయట వేచి ఉన్నారు. ఆయన రాగానే ఆయనపై పుష్పవర్షం కురిపించారు. జయహో అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అభిమానులు, మీడియావారు ఆయనను చుట్టుముట్టి కదలటానికి వీల్లేని పరిస్థితి కల్పించారు. ఓ దశలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. పోలీసులు అదుపుచేశారు.

తనకు అవార్డు వస్తుందని, రావాలని తనకంటే ఎక్కువ ప్రజలు కోరుకున్నారని వారి అభిమానమే అవార్డుల రూపంలో ఫలించిందని రెహ్మాన్‌ అన్నారు. అక్కడినుంచి ఆయన కోడంబాకంలోని స్వగృహానికి చేరుకున్నారు. ముంబయి విమానాశ్రయంలో రసూల్‌ పోకుట్టి, నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌లకు ఘనస్వాగతం లభించింది. అభిమానులు పూలమాలలతో వారిని ముంచెత్తారు. ఆస్కార్‌ను పైకెత్తి చూపుతూ వారు తమకు లభించిన స్వాగతం అపూర్వమని అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మైల్‌పింకీ టీమ్‌కు కూడా ఘనస్వాగతం లభించింది.

&13;
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST