హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహాత్మా గాంధీకే తప్పలేదు..బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మహాత్మా గాంధీ కూడా వివిధ సందర్భాల్లో తన అభిప్రాయాలు మార్చుకున్నారని, అదేమీ నేరం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాటి మాటికీ తన 'మనసులో మాట' పుస్తకంలోని విషయాలు ప్రస్తావిస్తున్నారంటూ కాంగ్రెస్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పేదల కోసం కొత్త ఆలోచనలు చేస్తే నేరమా అని ప్రశ్నించారు.

"నేను గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాసిన మనసులో మాట పుస్తకంలోని అంశాలను కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. కాల ప్రవాహంలో సందర్భాన్ని బట్టి అభిప్రాయాలు మారడం సహజం. చివరగా చెప్పిన దానినే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు కఠిన నిర్ణయాలు అవసరమని నేను కూడా గతంలో చెప్పాను. సంస్కరణలు ఫలించి... ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం పేదలకు చేర్చేందుకు ఇప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నాం. కాంగ్రెస్‌ వారికి అది పెద్ద నేరంలా కనిపిస్తోంది' అని చంద్రబాబు విమర్శించారు.

"పేదవాడికి అన్నం పెట్టి, సామాజిక భద్రత కల్పించేందుకే సీటీఎస్‌ కార్యక్రమం ప్రకటించాం' అని తెలిపారు. తమ పార్టీ ప్రకటించిన నగదు బదిలీ స్కీం (సీటీఎస్‌), కలర్‌ టీవీ పథకాలతో కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వారికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ బందిపోట్లలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. 18 బినామీ కంపెనీలతో వైఎస్‌, ఆయన తనయుడు లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X