9 ఏళ్లు కూతురిని రేప్ చేసిన తండ్రి

గురువారం, మార్చ్ 19, 2009, 12:15 [IST]
న్యూఢిల్లీ: దీర్ఘ కాలంగా తన కూతురిని రేప్ చేస్తూ వస్తున్న 60 ఏళ్ల ముంబై వ్యాపారవేత్తను మీరా రోడ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తనను తండ్రి రేప్ చేస్తూ వస్తున్నా 21 ఏళ్ల కూతురు 9 ఏళ్లుగా మౌనంగా ఉండిపోయింది. తనతో సరిపెట్టకుండా అతను తన 15 ఏళ్ల సోదరిని కూడా రేప్ చేయడానికి సిద్దపడడంతో ఆమె వీడింది. ఆ బాలిక తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి సహకరించినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మీరా రోడ్ దంపతులు తాంత్రికుడి మాయలో పడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. తండ్రి కూతురితో లైంగిక సంబంధం నెరిపితే కుటుంబం సంపదలతో తులతూగుతుందని తాంత్రికుడు 2000 జులైలో చెప్పినట్లు వారు తెలిపారు. అప్పుడు ఆ బాలికకు 12 ఏళ్లు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోలీసు స్టేషనుకు వచ్చి తల్లిదండ్రులపై, తాంత్రికుడిపై ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురిని రేప్ చేసిన వ్యాపారవేత్త గుజరాత్ కు చెందినవాడు. అంధేరీలో అతనికి ఆటోమొబైల్స్, రేడియం ప్లేట్ల తయారీ యూనిట్ ఉన్నాయి.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST