
ముంబయి: కొద్ది రోజుల క్రితం లక్మే ఫ్యాషన్ షోలో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నాను వకోలా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 950 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. న్యాయవాది భైరవ్ చౌదరితో కలిసి వచ్చిట్వింకిల్ తమకు లొంగిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఆమె రెండు గంటల పాటు పోలీసు స్టేషనులో ఉన్నారు.
Read: In English
&13;ఇక తాము అక్షయ్ కోసం చూస్తున్నామని వకోలా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ అర్వింద్ మహాబ్ది చెప్పారు. అక్షయ్, ట్వింకిల్ అసభ్యంగా వ్రవర్తించారని ఒక సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అక్షయ్ ప్యాంట్ బటన్ తీయడానికి ఒక మహిళ ముందుకు వచ్చినప్పుడు అందుకు నిరాకరించి అతను ట్వింకిల్ దగ్గరకు వెళ్లాడు. ట్వింకిల్ అక్షయ్ ప్యాంట్ బటన్ తీసింది.









