లెఫ్ట్ ఆశీస్సులు అవసరం: పవార్

గురువారం, ఏప్రిల్ 23, 2009, 14:38 [IST]
Sharad Pawar
బారామతి: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వామపక్షాల మద్దతు అవసరమని, సార్వత్రిక ఎన్నికల అనంతరమే యూపీఏ నేతను ఎంపిక చేస్తామని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపి) అధినేత శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో యూపీఏ భాగస్వామ్యపక్షాలు వేరువేరుగా పోటీ చేస్తున్నప్పటికీ ఎన్నికల అనంతరం ఏకతాటిపైకి వస్తాయని ఆయన వెల్లడించారు.

ఈసారి తమకు వామపక్షాల ఆశీస్సులు, మద్దతు అవసరమని ఆయన అన్నారు. వామపక్షాలతో సత్సంబంధాలను కొనసాగించాలని అందుకే తాను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము స్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత వామపక్షాలకు కూడా కూడా దక్కుతుందని ఆయన అన్నారు. మతపార్టీలను ఏ సమయంలో కూడా బలపరచని పార్టీలు వామపక్షాలు మాత్రమేనని ఆయన అన్నారు. గురువారం బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మన్మోహన్ సింగ్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకునే హక్కు కాంగ్రెసుకు ఉందని, యుపిఎ తరఫున నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఆర్జెడీ, సమాజ్ వాదీ, ఎల్జెపిలను యుపిఎలోకి తీసుకు రావడానికి తాను ప్రయత్నాలు చేస్తానని ఆయన చెప్పారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST