
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) చైర్మన్ లలిత్ మోడీకి పంజాబ్ హైకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లినందుకు హైకోర్టు ఆయనకు ఆ నోటీసు జారీ చేసింది. జైపూర్ పేలుడు బాధితులకు డబ్బులు చెల్లించనందుకు దాఖలైన కేసులో మంజూరైన బెయిల్ ను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని హైకోర్టు లలిత్ మోడీని ప్రశ్నించింది.
Read: In English
&13;నిరుడు మే 13వ తేదీన సంభవించిన బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఐపియల్ సీజన్ సందర్భంగా నిరుడు లలిత్ మోడీ ప్రకటించారు. అయితే ఈ నిధులు అందించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నాగరిక్ మోర్చా అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు లలిత్ మోడీపై కేసు నమోదు చేశారు.



















