హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు నాలుగో ఫ్రంట్ గందరగోళం

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన నాలుగో కూటమిపై పార్టీలోనే తీవ్ర గందరగోళం నెలకొంది. నాలుగో ఫ్రంట్ లో తాము ఉంటామని, ప్రధాని అభ్యర్థికి శరద్ పవార్ అర్హుడని చిరంజీవి చేసిన ప్రకటనపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరద్ పవార్ ను తాము ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడం లేదని ప్రజారాజ్యం సీనియర్ నేత పి.శివశంకర్ అంటున్నారు. జాతీయ స్థాయిలో నాలుగో ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అభిప్రాయపడుతున్నారు.

నాలుగో ఫ్రంట్ విషయాలన్నీ సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్ చూసుకుంటున్నారని చిరంజీవి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పటికిప్పుడైతే ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత మూలయం సింగ్ యాదవ్, లోక్ జనశక్తి నాయకుడు రాం విలాస్ పాశ్వాన్ కలిసి ఏర్పాటు చేసిన కూటమిని నాలుగో కూటమిగా పిలుస్తున్నారు. చిరంజీవి చెబుతున్న నాలుగో ఫ్రంట్ కూడా ఇదేనని అమర్ సింగ్ తో ఆయన దోస్తీని బట్టి అర్థమవుతోంది.

ఇక, చిరంజీవి నిర్వహిస్తున్న జిల్లా సమీక్షా సమావేశాలు కూడా గమ్మత్తుగా జరుగుతున్నాయి. సమీక్షా సమావేశాలకు వచ్చిన పార్టీ అభ్యర్థులంతా తాము విజయం సాధిస్తామని చెబుకుంటున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా తాము గెలుస్తామని చెప్పుకుంటున్నారు. ఇటువంటి ప్రకటన వల్ల లాభం లేదనే విషయాన్ని చిరంజీవి గుర్తించడం లేదు. పార్టీ పెట్టడానికి ముందు ఇచ్చిన హైప్ నే జిల్లా సమీక్షా సమావేశాల ద్వారా ఫలితాల వెల్లడికి ముందు చిరంజీవి ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X