వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకీకి అయినా హిట్టిస్తాడా?

By Staff
|
Google Oneindia TeluguNews

Venkatesh
కంత్రి, బిల్లా చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ చిత్రంలో నటించేందుకు వెంకటేష్ కమిటయ్యారని సమాచారం. బిల్లా చిత్రాన్ని చూసిన వెంకటేష్ వెంటనే మెహర్ కి కంగ్రాట్స్ చెప్పి స్టైలిష్ గా చూపెట్టవని మెచ్చుకున్నారు. అనంతరం మెహర్ వెంటనే వెంకీని ఫాలో అప్ చేసి స్టోరీ లైన్ ని వినిపించటం జరిగింది. కథ నచ్చిన వెంకటేష్ తాను ప్రస్తుతం చేస్తున్న ఈనాడు (ఎ వెన్సడే రీమేక్) పూర్తవ్వాలని, అనంతరం శ్రీను వైట్ల సినిమా పూర్తయిన తర్వాతే చేద్దామన్నారు. దానికి ఓకే చేసిన రమేష్ స్క్రిప్టు వర్క్ లో పడ్డారని సమాచారం.

ఇక ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పైనే తీయాలని సురేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ఓ హిందీ చిత్రం ఫ్రీమేక్ అయి ఉండవచ్చునని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇక వెంకటేష్ సైతం చింతకాయిల రవి తర్వాత మరింత జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంపికచేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కోవలో క్రిష్ తయారు చేసిన స్క్రిప్టు, చంద్రశేఖర్ ఏలేటి స్టోరీ లైన్స్ సైతం పరిగణలోకి తీసుకుని వర్క్ చేయిస్తున్నారని వినపడుతోంది. ఇక మెహర్ రమేష్ ఈ చిత్రంతోనయినా హిట్ దారిలో పడతాడా అని అందరూ అనుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X