హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు అమ్మాయికి అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

Nikitha
కాలిఫోర్నియా: కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయం నార్త్‌రిడ్జ్‌ జీవశాస్త్ర విద్యార్థులకిచ్చే ప్రతిష్టాత్మక బెన్నెట్‌-బిక్‌ ఫోర్డ్‌ అవార్డు తెలుగు అమ్మాయి నిఖిత త్రిపురనేనికి దక్కింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనే జీవశాస్త్ర అధ్యయనంలో ప్రదర్శిస్తున్న ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్టు విశ్వవిద్యాలయ జీవశాస్త్ర విభాగానికి చెందిన రాండీ డబ్ల్యు. కొహెన్‌, పాల్‌ విల్సన్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌ కు చెందిన త్రిపురనేని రాజేంద్ర కుమార్తె నిఖిత అమెరికాలోని కాలిఫోర్నియాస్టేట్‌ నార్త్‌రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సు చదువుతోంది. ఈ అవార్డు పొందేవారి పేర్లను విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగంలో ప్రదర్శిస్తారు. మే 19న బొటానికల్‌ గార్డెన్‌లో జరిగే ప్రత్యేకకార్యక్రమంలో అవార్డును ఇవ్వనున్నట్టు విశ్వవిద్యాలయవర్గాలు తెలిపాయి. విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌, మేథమేటిక్స్‌, జీవశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X