
న్యూఢిల్లీ: బిజెపి ఫిలిభిత్ అభ్యర్థిపై నాసా ప్రయోగం చెల్లదని అలహాబాద్ హైకోర్టు నియమించిన సలహా సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మాయావతి ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వరుణ్ కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను సలహా సంఘం విస్మరించిందని మాయావతి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన పిటిషన్ లో వాదించింది.
Read: In English
వరుణ్ గాంధీకి ఊరట కలిగిస్తూ సలహా సంఘం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. వరుణ్ ఏప్రిల్ 8వ తేదీన సలహా సంఘం ముందు హాజరయ్యారు. తనపై ఆరోపణలకు చూపుతున్న సిడిని మార్చారని వరుణ్ చెప్పుకున్నారు. వరుణ్ పై నాసా ప్రయోగం చెల్లదని సలహా సంఘం నిర్ణయించింది.




















