వరుణ్ గాంధీ కి సుప్రీం రిలీఫ్

గురువారం, మే 14, 2009, 13:33 [IST]
Varun Gandhi
న్యూఢిల్లీ: బీజేపీ నేత వరుణ్‌ గాంధీకి సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. వరుణ్‌ పై జాతీయ భద్రత చట్టం (నాసా) విధింపు చెల్లదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలక్రిష్ణన్‌ తీర్పు చెప్పారు. వరుణ్‌ పై నాసా చట్టాన్ని ఎత్తి వేయాలని ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌ కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫిలిబిత్‌ లో ఓ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు మాయావతి ప్రభుత్వం వరుణ్‌పై నాసాను ప్రయోగించింది. దీంతో వరున్‌ మార్చి 28న అరెస్టు అయ్యారు. 19 రోజులో జైల్లో గడిపిన అనంతరం వరుణ్‌ ఏప్రిల్‌ 16న పెరోల్‌పై విడుదల అయ్యారు. ఈ రోజుతో వరుణ్‌ పెరోల్‌ ముగిసింది.
  Read:  In English 
తనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగించిన నాసాను కొట్టివేయాలని వరుణ్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్ర సలహా బోర్టు తనపై నాసా ప్రయోగాన్ని ఎత్తేయాలని నిర్ణయించినందున తనపై నాసాను కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఆ మేరకు వరుణ్ గాంధీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ముందు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సలహా సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ తో పాటు ఈ పిషటిన్ పై కూడా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.
User Comments
Thanks Mayavathi 14 May 2009 07:26 pm
Varun should thanks to Maya that she made him a big political person. Any controversy is good fro BJP...
kirayi 14 May 2009 04:38 pm
Hats off that at last the Supreme Court Slapped Mayavati. We should not encourage people like Mayavati who misuses lower caste people as her pawns
అభిమాని 14 May 2009 02:40 pm
జై వరుణ్ గాంధీ భవిష్యత్ ప్రధానమంత్రి
బీజేపీ abhimaani 14 May 2009 02:38 pm
చాల మంచి జరిగింది
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST  
IPL, Feroz Shah Kotla, Delhi
Match starts at 08:00 pm IST