
చండీఘర్: చీటింగ్ కేసులో ఓలింపిక్స్ స్వర్ణ పతక విజేత అబినవ్ బింద్రా తండ్రి ఎఎస్ బింద్రాను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లో లక్షలాది రూపాయల మోసానికి పాల్పడినందుకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పంజాబ్ లోని ఫామ్ హౌస్ లో ఎఎస్ బింద్రాను పంజాబ్ పోలవీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఎఎస్ బింద్రా 90 లక్షల రూపాయల మేరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. పంజాబ్ లోని దేరబాసి పట్టణంలో పంజాబ్ మీట్స్ లిమిటెడ్ ప్లాంట్ స్థాపనకు అతను ఈ రుణాలు తీసుకున్నాడు. అరెస్టయిన వెంటనే తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఎఎస్ బింద్రా పోలీసులకు చెప్పాడు. దీంతో పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. శనివారం ఎఎస్ బింద్రాను ఢిల్లీకి తీసికెళ్లే అవకాశం ఉంది.




















