ప్రభాకరన్ బతికే ఉన్నారు: ఎల్టీటిఇ

మంగళవారం, మే 19, 2009, 9:52 [IST]
Prabhakaran
కొలంబో: పెద్దపులి వేలుపిళ్లై ప్రభాకరన్ చనిపోయినట్లు శ్రీలంక ప్రభుత్వం చేసిన ప్రకటనను ఎల్టీటిఇ ఖండించింది. ప్రభాకరన్ క్షేమంగానే ఉన్నారని ఎల్టీటిఇ అంతర్జాతీయ సంబంధాల అధినేత ఎస్. పత్మనాథన్ మంగళవారంనాడు చెప్పినట్లు తమిళ డాట్ నెట్ తెలియజేసింది. తమ రాజకీయ విభాగం నాయకులు నదేశ్న్, ఎస్.పులిదేవన్ లను శ్రీలంక ప్రభుత్వం హతమార్చడం అమానుషమని, దీనిపై దర్యాప్తు జరగాల్సి ఉందని ఆయన అన్నారు.&13;నిరాయుధులైన ఎల్టీటిఇ నాయకులను పథకం ప్రకారం హతమార్చినట్లు తమిళనెట్ రాసింది. తమిళ ప్రజల గౌరవం కోసం, స్వేచ్ఛ కోసం ప్రభాకరన్ తన పోరాటాన్ని కొనసాగిస్తారని పత్మనాథన్ అన్నట్లు తమిళ నెట్ రాసింది. ఆయన ప్రకటన పూర్తి పాఠాన్ని ఇచ్చింది. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నందున కాల్పులను విరమించాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
User Comments
సురేష్ కుమార్ 20 May 2009 02:38 pm
ఇది ఒక శాంపిల్ కామెంట్ మాత్రమే. నిజం మాత్రం కాదు. సరేనా???
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST  
IPL, Feroz Shah Kotla, Delhi
Match starts at 08:00 pm IST