
వాషింగ్టన్: రెండో సారి ప్రధాని పదవిని చేపట్టబోతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందించారు. మన్మోహన్ సింగ్ తాను గౌరవించే అతి తెలివైన నేత అని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరలో తాను ఢిల్లీ పర్యటనకు వస్తానని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని అమెరికాలోని నూతన భారత రాయబారి మీరా శంకర్ తో ఒబామా చెప్పారు.
Read: In English
&13;భారత, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు తాను కృషి చేస్తాని మీరా శంకర్ చెప్పారు. రోనెన్ సేన స్థానంలో మీరా శంకర్ నియమితులయ్యారు. మీరా శంకర్ ఏప్రిల్ 26వ తేదీన వాషింగ్టన్ వచ్చారు. అంతకు ముందు ఆమె జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు. ఆమె అంతకు ముందు పలు ప్రధాన బాధ్యతలు నిర్వహించారు.

















