ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్ధులపై దాడి

మంగళవారం, మే 26, 2009, 13:53 [IST]
  Read:  In English 
మెల్‌బోర్న్‌: ఇంట్లో ఉన్న నలుగురు ఆంధ్రా విద్యార్థులపై ఇద్దరు విదేశీ టీనేజర్లు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఫిసా) వప్యవస్థాపకుడు గౌతమ్‌ గుప్తా తెలిపారు.

నిందితులిద్దరినీ అరెస్టుచేశారని, వారిలో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారని కూడా ఆయన వివరించారు. జాతి దురహంకారతోనే వారీ దాడులకు పాల్పడ్డారని, ఇలాంటి సంఘటనల వల్ల 35 లక్షల డాలర్ల ఆస్ట్రేలియన్‌ విద్యావ్యాపారం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని గుప్తా తెలిపారు. బాధితులు నలుగురూ ఆంధ్రప్రదేశ్‌ కు చెందినవారేనని ఆయన తెలిపినా వారి పేర్లు, ఇతర వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న వైనంపై విక్టోరియా ప్రభుత్వం దృష్టిపెట్టాలని గుప్తా డిమాండు చేశారు. "గతంలో ఇలాంటి దాడులు రహస్యంగా జరిగేవి. కానీ, ఈ మధ్య వీటికి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత భద్రత విషయమై అవగాహన కోసం త్వరలో ఫిసా ఓ వీడియోను కూడా విడుదల చేయనుంది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets