కుప్వారాలో ఆఫీసర్, సైనికుడు మృతి

సోమవారం, జూన్ 8, 2009, 17:47 [IST]
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు. వారితో పాటు ముగ్గురు వేర్పాటువాద గెరిల్లాలు హతమయ్యారు. హత్ ముల్లా సమీపంలోని గులాబ్ బౌల్ ను తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం చుట్టుముట్టాయి. ఈ సమయంలో గెరిల్లాలకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
  Read:  In English 
గాలింపు జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో ఆర్మీ మేనేజర్, సైనికుడు మరణించారని లెఫ్టినెంట్ కల్నల్ జెఎస్ బ్రార్ సోమవారం చెప్పారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets