చిత్రకూట్ లో నలుగురు పోలీసులు బలి

గురువారం, జూన్ 18, 2009, 14:37 [IST]
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్‌ జిల్లాలో మూడు రోజులుగా బందిపోట్లకు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి చెందారు. జమేలి అనే ప్రాంతంలో బందిపోట్లు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి చుట్టుముట్టారు. దీంతో బందిపోట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. స్థానికుల ఇళ్లలో దాక్కుని బందిపోట్లు పోలీసులపైకి కాల్పులు జరుపుతున్నారు. ఈ ఎదురు కాల్పులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. బందిపోట్లలో పేరు మోసని ఘనశ్యాం కేవత్ ఉన్నాడనే సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. తాము గ్రామాన్ని చుట్టుముట్టారమని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కోరామని అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ బ్రిజాల్ గురువారంనాడు చెప్పారు. పోలీసుల నుంచి తప్పించుకోవడాని ఘనశ్యాం గురువారం తెల్లవారు జామున రెండున్నర గంటలకు విఫలయత్నం చేశాడు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets