లాస్ ఏంజెల్స్: పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ మరణించారు. లాస్ ఏంజెల్స్ లోని కౌంటీ కొరొనర్స్ కార్యాలయం అధికారి చెప్పారు. పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ గుండెపోటుతో మరణించినట్లు ల్యూటినంట్ ఫ్రెడ్ కొర్రల్ చెప్పారు. జాక్సన్ కు 50 ఏళ్లు, 50 ఏళ్ల జాక్సన్ గుండెపోటుతో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.26 గంటలకు కన్ను మూశారు. ఆయన భౌతిక కాయానికి శుక్రవారం పోస్టు మార్టం జరుగుతుంది. పాప్ కింగ్ గా పేరు మోసిన జాక్సన్ సంగీత, నృత్యాల్లో, మ్యూజిక్ వీడియోల్లో విప్లవం తెచ్చారు. 1958 ఆగస్టు 29వ తేదీన ఆయన జన్మించారు. తన నలుగురు సోదరులతో కలిసి ఐదుగురితో పాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. 1969లో ఈ గ్రూప్ మోటవున్ రికార్డ్స్ తో కాంట్రాక్టు కుదుర్చుకుంది. అప్పటి నుంచి ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. జాక్సన్ ఆల్బం థ్రిల్లర్ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లరుగా రికార్డు సృష్టించింది. జాక్సన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చిన్ననాటి నుంచే పాప్ సింగర్ గా పేరు పొందాడు.
&13;మైకెల్ జాక్సన్ కు శ్రద్ద్దాంజలి గటించండి.
&13;మైకెల్ జాక్సన్ కు శ్రద్ద్దాంజలి గటించండి.




















