న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతపై ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత లిబర్హాన్ కమిషన్ తన నివేదికను ప్రధాని మన్మోహన్ సిగ్ కు సమర్పించింది. కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం సమక్షంలో జస్టిస్ లిబర్హాన్ మంగళవారం నివేదికను ప్రధానికి సమర్పించారు. నివేదికలోని అంశాలు వెంటనే వెల్లడి కాలేదు.
బాబ్రీ మసీదు కూల్చివేతలో బిజెపి నేత ఎల్ కె అద్వానీ, భజరంగ్ దళ్ పాత్రను నివేదిక వెల్లడించే అవకాశం ఉందని టైమ్ నవ్ అనే టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. కూల్చివేతలో బిజెపి ఇతర నేతల పాత్రను కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైంది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద యెత్తున మత ఘర్షణలు చెలరేగాయి. దీనిపై విచారణ నిమిత్తం ప్రభుత్వం 17 ఏళ్ల క్రితం లిబర్హాన్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ 48 సార్లు పొడగింపులు పొందింది. కమిషన్ కార్యకలాపాలకు 8 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కమిషన్ 400 సార్లు విచారణ కోసం సమావేశమైంది. ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వాంగ్మూలాలను సేకరించింది.