ఆసీస్ లో మరో భారత విద్యార్థిపై దాడి

మంగళవారం, జూన్ 30, 2009, 12:42 [IST]
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై దాడి జరిగింది. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడుల క్రమంలో ఇది 20వది. అతని టర్బన్ ను తొలగించి వెంట్రుకలను కత్తిరించే ప్రయత్నం చేశారు. రేషం సింగ్ అనే ఆ 22 ఏళ్ల సిక్కు విద్యార్థిపై ఆరుగురు టీనేజర్లు దాడి చేశారు. రేషం సింగ్ హాస్పిటాలిటీ కోర్సు విద్యార్థి. అతను ఆరు నెలల క్రితమే ఇక్కడికి వచ్చాడు. డాండేనోంగ్ స్టేషనులో సోమవారం ఈ దాడి జరిగింది.
  Read:  In English 
ఇంగ్లీష్ సరిగా రాని సింగ్ పంజాబీలో తనపై జరిగిన దాడి గురించి వివరించాడు. తొలుత వచ్చి తనను దూషించారని, ఆ తర్వాత మరింత మందితో కత్తెర తీసుకుని వచ్చారని, తన టర్బన్ ను తొలగించి, తన వెంట్రుకలు కత్తిరించడానికి ప్రయత్నించారని అతను చెప్పాడు. తన మిత్రులు తనను రక్షించడానికి ప్రయత్నించారని అతను చెప్పాడు. దాడి చేసినవారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets