రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

శుక్రవారం, జూలై 3, 2009, 13:48 [IST]
Mamata Banerjee
న్యూఢిల్లీ : రైల్వే మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం మధ్యాహ్నం శుక్రవారం తన బడ్జెట్ ను ప్రతిపాదించారు. సామాజిక, ఆర్థిక పరిమితి మేరకు రైల్వే బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా ప్రయోజనకరం కాకపోవచ్చునని ఆమె అన్నారు. ప్రజల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు ఆమె చెప్పారు. శుభ్రతకు, భద్రతకు, నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థికాభివృద్దిలో రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆమె చెప్పారు. అభివృద్ధిని రైల్వేలు మారుమూల ప్రాంతాలకు తీసుకుని పోతాయని ఆమె అన్నారు. - 50 రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ సౌకర్యాలు
- అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
- అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం
- రైళ్ల రాకపోకల్లో సమయపాలనకు ప్రాధాన్యం
- 375 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
- ప్రైవేట్ భాగస్వామ్యంతో సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి
- అంతర్జాతీయ స్థాయిలో ముంబై, హౌరా, చెన్నై, తిరువనంతపురం స్ఠేషన్ల అభివద్ధి
- హైదరాబాదులో బహుళ ప్రయోజనకర సముదాయం
- ఢిల్లీ - ముంబై రైల్వే పారిశ్రామిక కారిడారు ఏర్పాటు
- రాయబరేలీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి
- కచ్రవడలో 500 బోగీలు నిర్మించగల కొత్త కోచ్ ఫ్యాక్టరీ
- ప్రధాన రైల్వై మార్గాల్లో రైల్వే ల్యాండ్ బ్యాంకుల ఏర్పాటు
- వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక విశ్రాంతి గదులు, ప్రత్యేక కోచ్ లు, ప్రత్యేక ఎస్కులేటర్లు
- రాజధాని, శతాబ్ది రైళ్లలో ఇన్ఫోటైమ్ మెట్ సౌకర్యం
- సాధారణ టికెట్ల అమ్మకానికి వెండింగ్ మిషన్ల పెంపు 5 వేల నుంచి 8 వేలకు
- దూర ప్రయాణాల రైళ్లలో వైద్య సేవలు
- 5 ిదోల పోస్టాఫీసుల్లో సాధారణ టికెట్ల విక్రయం
- 200 అదనపు రిజర్వేషన్ కౌంటర్లు
- ఇంటర్ సిటీ డబుల్ డెక్కర్లలో ఎసి కోచ్ లు
- టికెట్ల అమ్మకానికి 50 సంచార వాహనాలు
- ఎస్ఎంఎస్ ల ద్వారా వెయిటింగ్ టికెట్ల అమ్మకాలు
- 50 రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు
- రైల్వే స్టేషన్లలో బహుళ ప్రయోజనకర కాంప్లెక్సు ఏర్పాటు
- రైళ్లలో కాలుష్య రహిత మరుగుదొడ్లు
- మహిళా కోచ్ ల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
- 140 స్టేషన్లలో సమీకృత భద్రతా వ్యవస్థ
- ఎస్సీ, ఎస్టీ పోస్టుల భర్తీకి ప్రత్యేక డ్రైవ్
- రైల్వే కుటుంబాల స్త్రీల సాధికారితకు ప్రాధాన్యం
- కొత్తగా 18 వేల వ్యాగన్లు
- రైళ్లలో మంచినీరు, నాణ్యమైన ఆహారం
- స్త్రీల కోచులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
- మహిళలకు ప్రత్యేక విశ్రాంతి గదులు
- మూడు రూట్లలో సూపర్ ఫాస్ట్ పార్శిల్ ఎక్సుప్రెస్సులు. అవి-ఢిల్లీ నుంచి తుకారాబాద్, రాయపురం నుంచి చెన్నై, వాపీ నుంచి ముంబై
- వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కోల్డ్ స్టోరేజీలు.
User Comments
కాఫీ కార్తిక్ బాపట్ల 04 Jul 2009 01:14 pm
ఏడ్చినట్లుంది నీ budget
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets