వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాల్లోకి అర్జున్ సింగ్ మనవడు

By Staff
|
Google Oneindia TeluguNews

Arunoday
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ మనవడు అరుణోదయ్ హిందీ చలనచిత్ర రంగంలోకి అడుగు పెడుతున్నారు. సినిమాల్లో ప్రవేశించడానికి తన తాత సహాయం ఏమీ తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఖర్చుల కోసం తాను విదేశాల్లో బౌన్సర్ గా పని చేశానని, ఫ్రీలాన్స్ రచయితగా కూడా పనిచేశానని ఆయన చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం సికిందర్ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు.

తమ తాత ముఖ్యమైన వ్యక్తి అని, అయితే ఆయనకు ఏ చలన చిత్ర దర్శకుడితో కూడా పరిచయం లేదని, పరిశ్రమలో ఆయనకు ఎవరూ తెలియదని, కుటుంబ సహాయం తీసుకోవడానికి తాను నిరాకరించానని ఆ 26 ఏళ్ల నూతన నటుడు అంటున్నాడు. తన సొంతంగానే తాను ఈ పనికి పూనుకున్నానని, చాలా మంది కుటుంబ సంబంధాల వల్లనే తనకు ఈ అవకాశం వచ్చిందని అనుకుంటారని, దీంతో తన కుటుంబానికి ఏ విధమైన సంబంధం లేదని గర్వంగా చెప్పుకోగలనని అరుణోదయ్ అన్నారు.

పియూష్ ఝా నిర్మిస్తున్న సికిందర్ సినిమాలో తాను కాశ్మీరీ ఉగ్రవాది పాత్రను పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ పాత్ర పేరు జహగీర్ అని చెప్పాడు. తనకు ఇష్టం లేని వ్యవహారాల్లో ఇరుక్కున్న పాత్ర అది అని ఆయన చెప్పారు. ఆ పాత్రకు తనపైనే ద్వేషమని, అదే సమయంలో విపరీతమైన కోపస్థుడని, ఇది ద్వంద్వ ప్రవృత్తికి సంబంధించిన పాత్ర అని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X