రాహుల్ ఇక జర్నలిస్టు కూడా

గురువారం, జూలై 30, 2009, 11:09 [IST]
Rahul Gandhi
న్యూఢిల్లీ: పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇక జర్నలిస్టుగా కూడా మారనున్నాడు. కలం చేత పట్టి రచనలు చేయనున్నాడు. యువజన కాంగ్రెసు తన కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను ప్రచురించే ఆలోచనలో ఉంది. ఎఐసిసి తెస్తున్న సందేశ్ పత్రిక రీతిలో ప్రత్యేకంగా యువజన కాంగ్రెసు జర్నల్ ను ప్రచురించబోతోంది.

యువజన కాంగ్రెసు తెచ్చే పత్రికలో తన కార్యకర్తల కార్యక్రమాలు ఉంటాయి. వాటితో పాటు ఈ పత్రికలో రాహుల్ గాంధీ సంపాదకీయం గానీ కాలమ్ గానీ క్రమం తప్పకుండా రాయనున్నారు. సందేశ్ పత్రికలో సోనియా గాంధీ రాసినట్లుగా ఈ పత్రికలో రాహుల్ గాంధీ రాస్తారట. కీలకమైన అంశాలపై కార్యకర్తలకు దశను, దిశను నిర్దేశిస్తూ ఆ రచనలుంటాయని అంటున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets