
పానాజీ: గోవా వైపు అనుమానస్పద నౌక వస్తోందని నిఘా సంస్థలు సమాచారం అందించడంతో కొంకణ్ తీరంలో భారత నావికా దళాలు, తీర ప్రాంత బలగాలు గస్తీని ముమ్మరం చేశాయి. గత రాత్రి ఆ నౌకకు సంబంధించిన సమాచారం నిఘా సంస్థల నుంచి గత రాత్రి గోవా పోలీసులకు అందింది. అది మహారాష్ట్రలోని సిందుదుర్గ్ నుంచి వస్తోందనేది నిఘా సంస్థల సమాచారం.
&13;
Read: In English
గోవా పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని భారత వైమానిక దళాల సమాచార సంబంధాల అధికారి కెప్టెన్ మనోహర్ నంబియార్ చెప్పారు. మత్స్యకారుల సిందుదుర్గ్ పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేశారు.&13;





















