జర్నలిస్టులపైకి ఎస్సై కాల్పులు

శుక్రవారం, ఆగస్ట్ 7, 2009, 11:22 [IST]
Anantapur
అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపుర్తిలో సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీరామ్ వీరంగం సృష్టించాడు. జర్నలిస్టులను చితకబాదాడు. టీవీ చానెల్ ప్రతినిధిపై గురువారం సాయంత్రం కాల్పులు జరిపాడు. ఎస్సై శ్రీరామ్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎంకె సింగ్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. తొలుత శ్రీరామ్ జర్నలిస్టులపై చేయి చేసుకున్నాడు. బండబూతులు తిట్టాడు.

ఎస్సై చర్యను నిరసిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులపై తన ప్రతాపం ప్రదర్శించాడు. దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న టీవీ జర్నలిస్టుపైకి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల నుంచి జర్నలిస్టు తృటిలో తప్పించుకున్నాడు. ఈ చర్యను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఎస్సైపై ఎస్పీ చర్యకు ఉపక్రమించాడు. మూడు నెలల క్రితం ఇదే ఎస్సై కృష్ణంరాజు అనే టీవీ జర్నలిస్టును నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడు. అప్పుడే చర్య తీసుకుని ఉంటే ఇక్కడిదాకా వచ్చేది కాదని అంటున్నారు.
User Comments
కక్క్ 31 Jan 2010 05:19 pm
వెస్ట్ పోలీసు ఆవేశం తగ్గించు కోవాలి మీడియా మీద దాడి చేసినవాడు ప్రజులును ఎలా కాపాడుతాడు పోలీసు లో మంచివారు చాలామంది ఉన్నారు ఈ లాంటి గాడిద లు అక్కడఅక్కడఅక్కడఅక్కడ ఉంతైఐ
kvr 07 Aug 2009 07:25 pm
కాంగ్రెస్ అధికారంలో ఇవన్ని మములే, లైట్ తేస్కో.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets