హైదరాబాద్: సోమవారం నుంచి హైదరాబాద్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు లష్కరే తోయిబా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు నిఘా సంస్థల నుంచి సమాచారం అందింది. ఇంటలిజెన్స్ బ్యూరో రాష్ట్ర అధికారులకు సమాచారం అందించింది. పాకిస్తాన్ లో శ్రీలంక క్రికెటర్లపై చేసినట్లుగా హైదరాబాదులో అంతర్జాతీయ క్రీడాకారులపై ఈ టోర్నమెంటు సందర్భంగా దాడి చేసే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.
గచ్చిబౌలిలో ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు పలువురు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే క్రీడాకారులు, ఇతర సిబ్బంది 200 మందిదాకా వచ్చారు. లష్కరే నుంచి ముప్పు ఉందనే సమాచారంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు సాయుధ రక్షణ కల్పిస్తున్నారు. పోటీలు జరిగే నాలుగు చోట్ల భద్రత చర్యలు పటిష్టపరిచారు.