అండమాన్ దీవుల్లో భూకంపం

మంగళవారం, ఆగస్ట్ 11, 2009, 8:36 [IST]
Andaman Islands
న్యూఢిల్లీ: అండమాన్ దీవులను సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, మంగళవారం తెల్లవారు జామున భూకంపం కుదిపేసింది.ఇది రెక్టార్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో హిందూ మహాసముద్రానికి సునామీ ప్రమాదం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటా 26 నిమిషాల ప్రాంతంలో భూకంపం వచ్చింది. పోర్ట్ బ్లెయిర్ కు 265 కిలోమీటర్ల దూరంలో ఇది చోటు చేసుకుంది. అయితే దీని వల్ల ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదు.

&13;ఈ భూకంపం ప్రభావంతో చెన్నైలోనూ, ఆంధ్ర కోస్తా తీరంలోనూ పలు చోట్ల భూమిలో ప్రకంపనలు వచ్చాయి. భారత్, మయన్మార్, ఇండోనేషియా, థాయ్ లాండ్, బంగ్లాదేశ్ లకు సునామీ ప్రమాదం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. అండమాన్ దీవులకు వంద కిలో మీటర్ల దూరంలో భూప్రకంపనలు వచ్చాయి.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets