బెంగుళూర్ లో తొలి స్వైన్ ఫ్లూ మృతి

గురువారం, ఆగస్ట్ 13, 2009, 14:13 [IST]
Swine Flu
బెంగుళూర్: భారత సైబర్ సిటీ బెంగుళూర్ లో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. బెంగుళూర్ లో 26 ఏళ్ల మహిళ మృతి చెందింది. దీంతో స్వైన్ ఫ్లూ వల్ల మరణించినవారి సంఖ్య దేశంలో 20కి చేరుకుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న రూప అనే 26 ఏళ్ల మహిళ డయాబెటిస్ వ్యాధితో సెయింట్ ఫిలోమినా ఆస్పత్రిలో చేరింది. అక్కడే ఆమె మరణించింది. మహారాష్ట్రలో 15 మంది, అహ్మదాబాద్, వడదొరా, తిరువనంతపురం, చెన్నైల్లో ఒక్కరొక్కరు మరణించారు.పూణేలో గురువారం ఉదయం మరో ఇద్దరు మరణించారు.పూణేలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో 9 నెలల పసి బాలుడు స్వాభిమాన్ కాంబ్లే స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించాడు. సహ్యాద్రి మునోట్ అస్పత్రిలో అతను మృతి చెందాడు. 79 ఏళ్ల మరో వృద్ధురాలు కూడా పూణేలో గురువారం మరణించింది.

&13;స్వైన్ ఫ్లూతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో ఐదుగురు మరణించారు. ఒక్క పూణేలోనే ఇప్పటి వరకు ప 12 మంది మరణించారు. మహారాష్ట్రలో 63 ఏళ్ల మహిళ, కేరళలో అమెరికా నుంచి కేరళకు తిరిగి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి స్వైన్ ఫ్లూతో మృత్యువాత పడ్డారు. కేరళలో స్వైన్ ఫ్లూ వల్ల తొలి మరణం సంభవించింది. నిస్సార్ అమెరికా నుంచి ఇటీవలే కేరళకు తిరిగి వచ్చాడు. చెన్నైకి కూడా ప్రయాణం చేశాడు. తిరువనంతపురం కిమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. వడదొరాలో ఏడేళ్ల బాలిక మరణించింది. గుజరాత్ లోని వడదొరాలో ఆర్యా బోర్డే అనే ఏడేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets