
సిమ్లా: తన పుస్తకాన్ని నిషేధించిన నరేంద్ర మోడీ గుజరాత్ ప్రభుత్వంపై బిజెపి బహిష్కృత నేత జస్వంత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాన్ని నిషేధించడం ఆలోచనను నిషేధించడమేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సాటానిక్ వర్సెస్ రాసిన సల్మాన్ రష్దీ పట్ల వ్యవహరించిన తీరులోనే గుజరాత్ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. నిషేధం తనకెంతో విషాదాన్ని కలిగించిందని ఆయన అన్నారు.
Read: In English
&13;జిన్నాను ప్రశంసిస్తూ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ను తప్పు పట్టినందుకు గుజరాత్ ప్రభుత్వం జస్వంత్ పుస్తకాన్ని నిషేధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.తన బహిష్కరణకు కారణాలు ఎవరూ చెప్పలేదని, తనను అర్థం చేసుకోనివ్వాలని జస్వంత్ సింగ్ అన్నారు. డార్జిలింగ్ పార్లమెంటు సభ్యుడిగా తాను కొనసాగుతానని ఆయన చెప్పారు.


















